Home  »  TV News  »  Karthika Deepam2 : జ్యోత్స్నకు షాకిచ్చిన దీప.. సూరజ్ కామెడీతో రచ్చరచ్చ!

Updated : Jun 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2 ).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -699 లో..... జ్యోత్స్నకి పెద్ద ఆర్డర్ వస్తుంది. తను ఎక్కువ కాస్ట్ చెప్పడంతో వచ్చిన కస్టమర్ వెళ్లిపోతుంటే నేను చేస్తానని దీప అతన్ని పిలిచి మీరు చెప్పిన కాస్ట్ కి చేస్తానని చెప్తుంది. దాంతో అతను అడ్వాన్స్ ఇచ్చి ఎక్కడికి డెలివరీ చెయ్యాలో చెప్పి వెళ్ళిపోతాడు. కస్టమర్ ఇచ్చిన చెక్ ని బ్యాంకులో వెయ్యమని మేనేజర్ కి సూరజ్ చెప్తాడు. దాంతో ఈ రోజు హాలిడే అని అతను చెప్తాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న కోపంగా ఉండడం చూసి ఏంటి అంత హాట్ హాట్ గా ఉందని అంటాడు. బావ నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని దీప చెప్తుంది.. పార్టీ లేదా అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత జ్యోత్స్న టీ తాగడానికి వెళ్తుంది. టీ పక్కన పెడుతుంది.. అప్పుడే సూరజ్ వచ్చి ఆ టీ తీసుకొని తాగుతాడు. ఆ తర్వాత నువ్వు చేసిన పని గురించి రౌడీ చెప్పింది మీ గ్రూప్ లో పెట్టాను. మీ తాత ఇప్పుడు ఫోన్ చేస్తాడని సూరజ్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతూ పెట్టనన్నావ్ కదా అని అంటుంది. పెట్టలేదులే ఏదో జోక్ చేసానని సూరజ్ అంటాడు. ఆ తర్వాత సూరజ్ పై జ్యోత్స్న కోప్పడి వెళ్తుంటే కాలు స్లిప్ అయి పడుతుంది. సూరజ్ నవ్వుతుంటే కనీసం హెల్ప్ చేయాలని లేదా అని తిడుతుంది. ఇప్పుడు నేను పడ్డ విషయం ఎవరికైనా చెప్పావో నీ సంగతి చెప్తానని సూరజ్ కి జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న తన క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. శివన్నారాయణ వచ్చి అమ్మ జ్యోత్స్న పడ్డావట దెబ్బ తగిలిందా అని అనగానే నీకు ఎవరు చెప్పారని జ్యోత్స్న అడుగుతుంది. ఆ తర్వాత కార్తీక్, దీప వచ్చి అడుగుతారు. సుమిత్ర ఫోన్ చేసి అడుగుతుంది. మేనేజర్ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది. సూరజ్ దగ్గరికి వెళ్లి ఎవరికి చెప్పనన్నావ్ కదరా మళ్ళీ ఎందుకు చెప్పావని జ్యోత్స్న అడుగుతుంది.

నేను ఎవరికి చెప్పలేదు సీసీటీవీ వీడియో తీసి ఎవరు ఇలా పడిపోవద్దని గ్రూప్ లో పెట్టాను.. నువ్వే చూసుకోలేదని సూరజ్ అంటాడు. మా మమ్మీకి ఎలా తెలిసిందని జ్యోత్స్న అనగానే ఇంట్లో వాళ్ళు కూడా జాగ్రత్త పడతారని ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టమని కార్తీక్ కి చెప్పానని సూరజ్ అనగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. మరొకవైపు ఆర్డర్ కి సంబంధించిన ఏర్పాట్లు చెయ్యమని వంట చేసేవాళ్ళకి దీప లిస్ట్ ఇస్తుంది. ఆ తర్వాత దీప వెళ్తుంటే తనకి కళ్ళు తిరుగుతాయి. దీప ఏమైందని కార్తీక్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.